Sunday, May 5, 2024

పేదలకు వైద్య సేవలు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి హ‌రీష్ రావు

హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యాన్ని మరింత చెరువ చేయాలనే లక్ష్యం అని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. హనుమకొండలో 1100 కోట్లతో నిర్మిస్తున్న ముల్టి స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పురోగతిని మంత్రి హరీష్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ , చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ దేశంలోనే ఈ ఆసుపత్రి చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఆరోగ్య ప్రదాయినిగా నిలుస్తుందన్నారు.

ప్రపంచ స్థాయికి అనుగుణంగా ముఖ్యంగా కేసీఆర్ ఆలోచనలతో కెనడా దేశంలోని ముల్టి స్పెషాలిటీ ఆసుపత్రులను పరిశీలించి అందుకు అనుగుణంగా నిర్మిస్తున్నామన్నారు. ఇచ్చిన గడువుకు అనుగుణంగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను, నిర్మాణ సంస్థను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తూర్పు శాసన సభ్యులు నన్నపనేని నరేందర్, నగర మేయర్ గుండు సుధారాణి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement