Saturday, April 27, 2024

రైతుల మ‌న‌సెరిగిన నాయ‌కుడు కెసిఆర్ – మంత్రులుఎర్ర‌బెల్లి, స‌త్య‌వ‌తి..

వ‌రంగ‌ల్‌ అర్బన్‌ : రైతుల‌ను క‌ష్ట కాలంలో ఆదుకోవాల‌న్న సంక‌ల్పంతోనే సీఎం కేసీఆర్ మ‌రోసారి ధాన్యం కొనుగోలుకు సిద్ధ ప‌డ్డార‌ని,. ఆయ‌న మ‌న‌సున్న గొప్ప నాయ‌కుడ‌ని పంచాయ‌తీరాజ్ శాఖ‌ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ధాన్యం కొనుగోలుపై వ‌రంగ‌ల్ అర్బన్‌, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాల్లో ప‌రిస్థితుల‌పై ప్రజాప్రనిధులు, క‌లెక్టర్లు, అధికారుల‌తో మంత్రులు స‌మీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, క‌రోనా కార‌ణంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, రైతులు ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌నే రూ.20వేల కోట్ల బ్యాంకు గ్యారంటీతో ధాన్యం కొనుగోలు చేప‌ట్టార‌ని మంత్రులు తెలిపారు. రైతుల మేలు కోరుతున్న సీఎం నిర్ణయానికి తగినట్లుగా అటు అధికారులు ప‌ని చేయాల‌ని, ఇటు రైతులు స‌హ‌క‌రించాల‌ని సూచించారు .

జ‌గ్జీవ‌న్ కు మంత్రుల నివాళి..

మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీనవర్గాల నేత బాబూ జగ్జీవన్ రామ్ అందరికీ స్ఫూర్తి ప్రధాత అని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కొనియాడారు. జగ్జీవన్‌ రామ్‌ 114వ జయంతి సందర్భంగా ఆయన చిత్రప‌టానికి మంత్రి దయాకర్‌ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత, ద‌ళిత వ‌ర్గాల పెన్నిధి జ‌గ్జీవ‌న్‌ రామ్‌ అని అన్నారు. వ్యవ‌సాయరంగ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎనలేదని అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. యువత జగ్జీవన్‌ రామ్‌ చూపిన మార్గంలో నడవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి క‌డియం శ్రీ‌హ‌రి, ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్‌, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement