Sunday, April 28, 2024

TS : జిల్లా విద్యాశాఖ అధికారి పై చర్యలు తీసుకోవాలి… కలెక్టర్‌కు ఆదేశం…

దళిత గిరిజన ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తూ వారిపట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ను ఆదేశించారు.

- Advertisement -

ఆదివారం జిల్లా కలెక్టర్ తో చరవాణిలో మాట్లాడుతూ గూడూరు మండల కేంద్రంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రానికి తనిఖీ చేయడానికి విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తన వ్యక్తిగత కోపాన్ని పదోతరగతి లో 8 లెటర్ చేస్తున్న ఉపాధ్యాయులపై చూపించి ఐదుగురు ఇన్సులేటర్లను సస్పెండ్ చేయడం అన్యాయమని తక్షణమే వారిని విధుల్లోకి తీసుకొని జిల్లా విద్యాశాఖ అధికారిపై జిల్లా కలెక్టర్ 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే నోటీసులు జారీ చేస్తారని హెచ్చరించారు. పబ్లిక్ రిఫరెంటెంటివ్ గా ఉన్నటువంటి అధికారి కనీసం ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో అతను ఉన్నారని వారి యొక్క ప్రవర్తన తీరును జిల్లా కలెక్టర్‌కు వివరించడం జరిగిందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement