Friday, May 3, 2024

TS : రైతుల నోట్లో మట్టి కొట్టారు… మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

రాష్ట్రంలోని రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొట్టిందని మాజీ మంత్రి, పెద్దపల్లి పార్లమెంటు బారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. 36 గంటల రైతు నిరసన దీక్ష లో భాగంగా ఆదివారం రెండో రోజు దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతూ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు.

- Advertisement -

నాలుగు నెలలు గడిచిన హామీల అమలు మాత్రం మర్చిపోయిందన్నారు. రెండు లక్షల రుణమాఫీ ఇస్తామని డిసెంబర్ 9వ తేదీన మాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. రైతుబంధు ద్వారా రైతాంగానికి పంట పెట్టుబడి అందించక పోవడంతో పాటు సాగునీరు కూడా అందించని దుస్థితి ఎదుర్కోలేక ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ పార్టీ పాపమేనా అని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దీక్షలు మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, కోరు కంటి చందర్, మనోహర్ రెడ్డి, రఘువీర్ సింగ్, రాజ్ కుమార్ తో పాటు పెద్ద సంఖ్యలో బారాస నాయకులు, కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement