Monday, April 29, 2024

కాంగ్రెస్ పార్టీ అంతర్గత నిర్మాణం.. సంస్థాగత ఎన్నికలపై సమీక్షా సమావేశం

ఏఐసిసి/టిపిసిసి ఆదేశానుసారం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత నిర్మాణం సంస్థాగత ఎన్నికలపై హన్మకొండ వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన మండల /బ్లాక్ /డివిజన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత నిర్మాణం సంస్థాగత ఎన్నికల కోసం నియమించిన హన్మకొండ జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీమతి లీలా శ్రీనివాస్ & వరంగల్ జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీ నారాయణ స్వామి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లడుతూ.. సంస్థాగత ఎన్నికలల్లో మండల పార్టీ అద్యక్షులు కానియండి, బ్లాక్ అద్యక్షులు కానియండి డివిజన్ అద్యక్షులుగా పోటి చేయడానికి కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు చేసుకున్న వారు మాత్రమే అర్హులన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న వారు డివిజన్, మండలం నుండి ప్రతి ఒక్క బూతు నుండి బూత్ ఎన్రోలర్, బూత్ ప్రెసిడెంట్, మండల బాధ్యులు, బ్లాక్ బాధ్యులు, అంతకు మించి ఉంటె వారి ఓటర్ ఐ.డి. నెంబర్, ఫోన్ నెంబర్ నియోజకవర్గ బ్లాక్ రిటర్నింగ్ ఆఫీసుర్లకు మండల పార్టీ అద్యక్షులు సమర్పించాలన్నారు. ఈ ప్రక్రియలలో మండల పార్టీ అధక్షులు డివిజన్ పార్టీ అధక్షులు కీలక పాత్ర వహించి వీలైనంత తొందరగా సమర్పించాలన్నారు. ఈ నెల 15 వ తేది చివరి తేది కాబట్టి ప్రతి బూత్ నుండి సభ్యుల వివరాలు వాటర్ ఐడి ఫోన్ నెంబర్లు మండల పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ బాధ్యులకి, నియోజకవర్గ బాధ్యులు బ్లాక్ రిటర్నింగ్ ఆఫీసర్ లకు, బ్లాక్ రిటర్నింగ్ ఆఫీసుర్లు జిల్లా డిఆర్ఓలకు అందజేయాలన్నారు. జిల్లా పార్టీ అద్యక్షులు, డిఆర్ఓలు నియోజకవర్గ బాధ్యులు, స్క్రూట్ ని చేసి పోటి ఉంటె ఎన్నికలు నిర్వహిస్తారు లేకుంటే ఏకగ్రీవం చేయడం జరుగుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement