Wednesday, May 15, 2024

టెన్త్ విద్యార్థుల‌కు గ్రేస్ మార్కులు ఇవ్వాలి : ప‌వ‌న్ క‌ల్యాణ్

టెన్త్ విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చి వారి భవిష్యత్ ను కాపాడాలని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ ప్ర‌భుత్వాన్ని కోరారు. ఈ విష‌యంలో ఆయ‌న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు తక్కువ ఉత్తీర్ణత సాధించడం ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని ఆరోపించారు. పాఠశాలల్లో అరకొర వసతులు, ఉపాధ్యాయుల కొరత తదితర కారణాల వల్ల విద్యార్థులకు సరైన బోధన అందలేదన్నారు. ఉచితంగా రీ-కౌటింగ్ నిర్వహించాలని, సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు తీసుకోకూడదని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు ఫెయిలైతే తల్లిదండ్రులపై నెపం వేయడాన్ని తప్పుపట్టారు. 2018-19 సంవత్సరాల్లో 94శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే ప్రస్తుతం 67 శాతానికి మాత్రమే పరిమితమవడం విద్యావ్యవస్థలో ఉన్న లోపాలకు అద్దం పడుతుందని ఆరోపించారు. ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే తల్లుల పెంపకం సక్రమంగా లేదని ప్రభుత్వంలోని బాధ్యత గల ప్రజా ప్రతినిధి వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement