Thursday, March 28, 2024

Land Issue: ఆ భూమి మాదే, 510కోట్ల పరిహారం ఇప్పించాలే.. వక్ఫ్​ ఆస్తిపై సుప్రీంలో పిటిషన్​

ఆ భూమి తనదేనని, దానికి చట్టపరమైన హక్కుదారుని కూడా తానేనని పేర్కొంటో ఓ వ్యక్తి సుప్రీం కోర్టు తలుపుతట్టాడు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వక్ఫ్ ఆస్తికి చట్టపరమైన వారసుడిగా పేర్కొంటూ పిటిషనర్​ అలీమ్​ అక్తర్​ కోర్టు మెట్లు ఎక్కాడు. 80 ఏళ్ల వివాదానికి సంబంధించి ఉత్తర ప్రదేశ్​ ప్రభుత్వం నుంచి తనకు 510 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని పిటిషనర్​ కోరాడు. అయితే.. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే తను జిల్లా కోర్టుకు వెళ్లగాఅక్కడ న్యాయం దక్కలేదని తెలిపాడు. ఈ కేసుని ఫతేపూర్​ జిల్లా మేజిస్ట్రేట్​ తిరస్కరించారని, అందుకే సుప్రీం కోర్టుకు వచ్చినట్టు తెలిపాడు.

అయితే.. భూసేకరణ, పునరావాసం (LARR) చట్టం, 2013లో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం కింద నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు ఆదేశాన్ని అక్తర్ సవాలు చేశాడు. ఇది అలహాబాద్ హైకోర్టులో ఉన్న సమస్య అని ఆయన పేర్కొన్నాడు. వక్ఫ్-అలాల్-ఔలాద్ ఆస్తికి సంబంధించి అంటే రాబోయే కాలానికి వారసులకు చెందిన ఆస్తి అని అర్థం.110 సంవత్సరాల క్రితం సమస్య ఉన్న భూమికి పిటిషనర్ యజమాని కాదని అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది” అని పిటిషన్‌లో పేర్కొన్నాడు.

ఎప్పటికైనా వారసులకు చెందిన ఆస్తికి సంబంధించి నష్టపరిహారం ఇవ్వకుండా హైకోర్టు తప్పు చేసిందని, ఆ ప్రకారంగా చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని లెక్కించి అందించాలని రాష్ట్రానికి (యూపీ) ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నాడు. జిల్లా మేజిస్ట్రేట్‌కు, తర్వాత భూసేకరణ కార్యాలయానికి ఫిర్యాదులు చేశానని పేర్కొన్నాడు. అంతేకాకుండా రెవెన్యూ రికార్డులలో ఈ ఆస్తికి సంబంధించి పిటిషనర్ తండ్రి ప్రస్తావన కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించాయన్నారు.  కానీ, తనకు పరిహారం ఇవ్వడం లేదని కోర్టుకు తెలియజేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement