Tuesday, May 7, 2024

అమృత్ మహోత్సవాలు విజయవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. నిఖిల

జనగామ.దేశానికి స్వతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వం స్వతంత్ర భారత్ అమృత్ మహోత్సవాలు చేపడుతున్నట్లు సందర్బంగా జిల్లాలో ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. నిఖిల అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వతంత్ర భారత్ అమృత్ మహోత్సవాల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె నిఖిల మాట్లాడుతూ, ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 24 బుధవారం 18 సంవత్సరాలు పైబడిన యువతీయువకులతో 2 కె రన్ నిర్వహించాలన్నారు. ఇందుకుగాను డిగ్రీ, ఫార్మసీ, ఇంజనీరింగ్ కళాశాలల బాధ్యులతో సమావేశమై యువతీయువకుల సమీకరణకు చర్యలు తీసుకువాలన్నారు. 2 కె రన్ సందర్భంలో ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా పోలీస్ వారు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే నెల 3 న కవి సమ్మేళనం ఏర్పాటుకు చర్యలు చేపట్టి, కవుల సన్మానం చేయాలన్నారు. 2 కె రన్, కవి సమ్మేళనం లలో పాల్గొన్న వారికి ధృవీకరణలు ఇవ్వాలన్నారు. ఇట్టి కార్యక్రమాల్లో పాల్గొనువారు ఖచ్చితంగా మాస్కులు ధరించి, కోవిడ్ నియంత్రణ చర్యలు పాటించాలని ఆమె తెలిపారు. జిల్లాలో ఉత్సవాలను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి కె. రంగాచారి, జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల అధికారి జివి. గోపాల్ రావు, జనగామ మునిసిపల్ కమీషనర్ కె. నర్సింహా, కలెక్టరేట్ ఏవో ఏ. ఆండాలు, ఆర్డీవో కార్యాలయ ఏవో గంగా భవాని, కలెక్టరేట్ సూపరింటెండెంట్ ఏతేషామ్ అలీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement