Friday, April 26, 2024

వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలి : మంత్రి ఎర్ర‌బెల్లి

వరసగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల తాజా పరిస్థితులు, పునరావాస చర్యలు, అంటు, సీజనల్ వ్యాధుల నివారణ వంటి పలు అంశాల పై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ కలెక్టరేట్ లో సంబధిత జిల్లా అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ వానాకాలం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త వహించాలని సూచించారు.

లోతట్టు ప్రాంతాలకు గుర్తించి ప్రజలను అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు పంపాలన్నారు. పునరావాస చర్యలు చేపట్టాలని చెప్పారు. వర్షాల తర్వాత అంటు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు. ఈ మేరకు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి అని జిల్లా కలెక్టర్ శివ లింగయ్యను మంత్రి అదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తాగునీరు సరఫరా పారిశుధ్యం నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు, zp సీఈఓ, డీపీఓ, డీఎం అండ్ హెచ్ఓ, drdo, police అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement