Saturday, May 4, 2024

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

మహదేవపూర్ (ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని ఎన్కపల్లి గ్రామ శివారులోని గుర్తు తెలియని మృతదేహాన్ని శనివారం మహాదేవపూర్ పోలీసులు గుర్తించారు. వయస్సు 35-40 సంవత్సరాలు, డబ్బాల చొక్కా, నైట్ పాయంట్ తో ఉందని, ఈ డెడ్ బాడిని ఎవరికీ సంబంధించిందో గుర్తు పట్టి స్థానిక పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఎస్ఐ ఎన్.రాజ్ కుమార్, సీఐ టి.కిరణ్ తెలిపారు. పీఎస్ మహాదేవపూర్.. 8712658138, ఎస్సై నెంబర్ : 8712658116, సీఐ నెంబర్ :8712658114 లకు సంప్రదించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement