Saturday, May 18, 2024

ఇది వల్గర్ సిరీస్ కాదు.. చూడ‌టం చూడ‌క‌పోవ‌డం మీ ఇష్టం.. డైరెక్ట‌ర్

సైతాన్ వ‌ల్గ‌ర్ సిరీస్ కాద‌ని..చూడ‌టం..చూడ‌క‌పోవ‌డం మీ ఇష్ట‌మ‌న్నారు ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్. కాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో సైతాన్ తెలుగు వెబ్ సిరీస్ రానుంది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసినవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందుకు కారణం ఈ ట్రైలర్లో కనిపించిన హింస నేపథ్యంలోని సన్నివేశాలు, అశ్లీలత .. అసభ్యతగా అనిపించే సంభాషణలు. దాంతో ఒక తెలుగు వెబ్ సిరీస్ లో ఈ స్థాయి విపరీత దృశ్యాలా అంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. మోతాదు మించిన దృశ్యాల పట్ల చాలామంది అసహనాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో మహి వి రాఘవ్ స్పందించారు..ఇది వల్గర్ వెబ్ సిరీస్ కాదు .. క్రైమ్ వరల్డ్ ను బేస్ చేసుకుని నడిచే కథ. అందువలన ఆ మాత్రం ఘాటైన దృశ్యాలు .. డైలాగ్స్ ఉంటాయి. ఈ కంటెంట్ ఎలాంటిది అనే విషయంలో ముందునుంచే మేం హెచ్చరికలు చేస్తూనే వస్తున్నాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement