Saturday, November 9, 2024

Mahbubabad : స్కూల్ బ‌స్సు ఢీకొని యువ‌కుడు దుర్మ‌ర‌ణం

మహబూబాబాద్ : జిల్లాలోని నిజాం చెరువు దగ్గర బతుకమ్మ విగ్రహం ముందు ఈరోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్ష్మీపురం నుంచి మహబూబాబాద్ కు ద్విచక్ర వాహనంపై వస్తున్న గుగులోతు సంతోష్‌ అనే యువకుడిని ఓ స్కూలు బస్సు ఢీకొనడంతో సంతోష్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఢీకొన్న బస్సు ఆపకుండా వేగంగా వెళ్లిపోవ‌డంతో మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు ఢీకొన్న వెంటనే సంతోష్‌ ను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయ‌గా అప్పటికే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించారు.

ఆ ప్రాంతంలో ఉండే సీసీ ఫుటేజ్ ల సహాయంతో మృతుని బంధువులు ఢీకొన్న బస్సును గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సంతోష్ ఇటీవల గ్రూప్ ఫోర్ పరీక్ష రాయడం కోసం ఖమ్మం జిల్లా చీమలపాడు నుంచి ద్విచక్ర వాహనం వేసుకొని మహబూబాబాద్ మండలం లక్ష్మీపురం గ్రామానికి తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఈరోజు ఉదయం తన ద్విచక్ర వాహనం రిపేరు కావడంతో ఆ వాహనాన్ని తాడుతో ఆటోకు కట్టుకొని మహబూబాబాద్ కు వస్తున్న క్రమంలో స్కూల్ బస్సు ఢీకొని సంతోష్‌ మృతి చెందినట్లుగా స్థానికులు చెబున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement