Wednesday, May 15, 2024

Godavarikhani – కాంగ్రెస్ ను గెలిపిస్తే త‌క్ష‌ణం సింగ‌రేణి ఎన్నిక‌లు … రేవంత్ రెడ్డి

గోదావరి ఖని : సింగరేణి ఓపెన్ కాస్ట్ గని ముందు గని ముందు కార్మికులతో టీ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. వారిని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు కీ రోల్ పోషించారని టీపీసీనీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కార్మికులంతా ఏకమై తెలంగాణ నినాదాన్ని దేశమంతా వినిపించారని రే కొనియాడారు. కానీ కేంద్ర ప్రభుత్వం సింగరేణికి ప్రైవేటు పరం చేయడానికి యోచిస్తోందని బీజేపీ మీద మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సింగ‌రేణి ఎన్నిక‌లు జ‌రుపుతామ‌ని అన్నారు.

గనులను ప్రైవేటు పరం చేసే బిల్లుపై బీఆర్ఎస్ సంతకం చేసింద‌ని,. ఇది నిజం కాదా అని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సింగరేణి కార్మికులు కాంగ్రెస్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత కాంగ్రెస్ ది అని హామీ ఇచ్చారు .
సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోందని, సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు ఇచ్చేలా మేనిఫెస్టోలో చేర్చుతామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
మరో నేత మధుయాష్కీ మాట్లాడుతూ.. సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్నారు.
గతంలో టిఆర్ఎస్ పక్షాన ప్రచారం చేశానని.. కానీ, సాధించింది ఏమీ లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ చెప్పిన మాటలు బూటకం అయ్యాయని, సింగరేణిలో ఉద్యోగులు నష్టపోతున్నారని.. పైరవీలు చేస్తున్న వారికే వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. తెలంగాణ సాధన సమయంలో సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు బూటకమయ్యాయని పొంగులేటి విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement