Friday, May 17, 2024

మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ గా వెంకటేశ్వర్లు బాధ్యతలు

మెదక్ ప్రతినిధి:ప్రభ న్యూస్ – మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా జి వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాలములోని తన చాంబర్ కు చేరుకుని బదిలీపై వెళ్లిన రమేష్ నుండి ఛార్జి తీసుకున్నారు. అంతకు ముందు ఆయన కలెక్టర్ రాజర్షి షా ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ కు స్వాగతం పలికి పరిచయం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement