Wednesday, November 29, 2023

వీరేశం మృతి పార్టీకి తీరని లోటు… స్పీకర్ పోచారం

బీర్కూర్, జులై 19 (ప్రభ న్యూస్) : వీరేశం మృతి పార్టీకి తీరని లోటని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో బుధవారం భారాస పార్టీ మండల అధ్యక్షుడు లాడెగమ వీరేశం దినకర్మలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరేశం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరేశం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… వీరేశం మృతి పార్టీకి తీరని లోటన్నారు.

- Advertisement -
   

మండల రాజకీయాల్లో 20 సంవత్సరాలకు పైగా అనుభవం వున్న వ్యక్తి వీరేశం అని, అందరినీ కలుగొలుపుతో ఉండేవాడని, వివాదరహితుడని స్మరించుకున్నారు. వీరేశం కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో భారసా రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, మాజీ జ‌డ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, ఎంపీపీ రఘు, ఎంపీటీసీ సందీప్ పటేల్, బారాస పార్టీ మండల యూత్ అధ్యక్షుడు శశికాంత్, ఎమ్మార్వో రాజు, మదినేని నాగేశ్వరరావు, కమ్మ సత్యనారాయణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement