Sunday, April 28, 2024

గజ్వేల్ ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన బన్సీలాల్

గజ్వేల్ జులై 19, ప్రభ న్యూస్ : గజ్వేల్ నూతన ఆర్డీఓగా బి.బన్సీలాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ను మార్యద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఇదివరకు ఆర్డీఓ గా పనిచేసిన విజేందర్ రెడ్డి ప్రమోషన్ పై వెళ్లడంతో హన్మకొండ తహసీల్దార్ గా పనిచేసిన బి.బన్సీలాల్ ప్రమోషన్ పై గజ్వేల్ ఆర్డీఓగా బాధ్య‌తలు స్వీకరించారు. ఈ సందర్భంగా అందరు అధికారులతో సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నూతన ఆర్డీఓకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement