Wednesday, October 16, 2024

NZB : ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించిన అర్భ‌న్ ఎమ్మెల్యే బిగాల గ‌ణేష్‌

నిజామాబాద్ సిటీ, నవంబర్ 20 (ప్రభ న్యూస్)
నిజామా బాద్ అర్బన్ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికి డివిజన్లో ప్రచారానికి వచ్చిన గణేష్ బిగాలకు బ్రహ్మరథం పడు తున్నారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల కి 37, 38వ డివిజన్ ప్రజలు మద్దతు పలికారు.

బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల 37 , 38వ డివిజన్ లలో అంబేద్కర్ కాల నీ,సంజీ వయ్య కాలనీ,అరుంధతి నగర్,ఆదర్శ్ నగర్ లలో కాలన ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ ,37వ డివిజన్ కార్పొరేటర్ కాంపల్లి ఉమారని ముత్యాలు, ప్యాట సంతోష్, నరేష్ యాదవ్, కో అప్షన్ సభ్యులు దారం సాయిలు, నాయకులు షఫీ,రాజేష్,ప్రవీణ్,ఇబ్రహీం,కన్నా రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement