Sunday, December 10, 2023

Updated – నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – అయిదుకి పెరిగిన మృతుల సంఖ్య‌

నల్గొండ: జిల్లాలోని చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొని కారు పల్టీ కొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు మృతి చెందగా, కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్‌ నుంచి అక్కంపల్లి వస్తున్న బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఘటనా స్థలంలో మద్దిమడుగు ప్రసాద్‌(38), అవినాష్‌(12) మృతి చెందారు. బైక్‌పై ఉన్న మహిళ, కారులో ఉన్న నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. పట్నపు మణిపాల్‌(18) మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గ మధ్యలో వనం మల్లికార్జున్‌(12), మద్దిమడుగు రమణమ్మ(35) మృతి చెందారు.

- Advertisement -
   

బైక్‌పై వస్తూ ప్రమాదానికి గురైన వారు పెద్దఅడిసర్లపల్లి మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కారులో ఉన్న వారు చింతపల్లి మండలం గుర్రంపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement