Wednesday, December 11, 2024

TS | షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు.. తెలంగాణలో జమిలి ఎన్నికలు లేనట్టే..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి మాత్రం విడిగానే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్‌ 6 తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉంది. అంటే ఇంకో 15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.

అక్టోబర్‌ 10వ తేదీ తర్వాత తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. నవంబర్‌ చివరి వారం లేదా డిసెంబర్‌ తొలి వారంలో పోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు అయింది. రాష్ట్రంలో అక్టోబర్‌ 3 నుంచి ఈసీ బృందం పర్యటించనుంది. మూడు రోజులపాటు ఈసీ బృందం పర్యటించనుంది.

రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. రాజకీయ పార్టీలతో అధికారులు సమావేశం కానున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో చర్చించనున్నారు. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. అలాగే తెలంగాణ సీఎస్‌, డీజీపీతో ఈసీ బృందం సమావేశం అవ్వనుంది.

- Advertisement -

అక్టోబర్‌ 4న అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో ఈసీ బృందం భేటీ కానుంది. అక్టోబర్‌ 6న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమావేశం అవ్వనుంది. ఈవీఎంల నిర్వహణపై ఈసీఐఎల్‌ అధికారులతో ఈసీ బృందం భేటీ కానుంది. అక్టోబర్‌ 6న తెలంగాణ ఎన్నికలపై నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల అంశాన్ని ముందుకు తెచ్చింది. జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ పార్టీలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నెలకొంది. అధికార బీఆర్‌ఎస్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీలు ప్రచారం మొదలు పెట్టాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement