Tuesday, May 7, 2024

Fish Restaurant – తొలి ఆంధ్రా ఫిష్ హబ్‌ తిరుపతిలో ప్రారంభం ….

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఈరోజు తిరుపతిలో రాష్ట్రం లో తొలి ఫిష్ ఆంధ్రా హబ్ ప్రారంభమైంది. స్థానిక మంగళం రోడ్డు, శ్రీరాం నగర్ వద్ద లబ్దిదారు భావనా జ్యోతి ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్రా లాంజ్ (చేపల అమ్మకం, రెస్టారెంట్ ) ను నగరపాలక మేయర్ శిరీష, జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి లు సంయుక్తంగా ప్రారంభిచారు. నగరాల్లో అందుబాటులోకి తీసురావాలని, ఇతర రాష్ట్రాల్లోనూ ఆంధ్రా ఫిష్ హబ్ ల ద్వారా విక్రయాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఫిష్ ఆంధ్రా – ఫిట్ ఆంధ్రా నినాదంతో ఫిష్ హబ్ ల ఏర్పాటులో భాగంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్ వై) – ఫిష్ ఆంధ్రా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఔట్ లేట్ లకు సబ్సిడీతో కూడిన రుణాలను అందిస్తున్నదని కలెక్టర్ వెంకటరమణా రెడ్డి అన్నారు .

రాష్ట్ర వ్యాప్తంగా 2.12 లక్షల హెక్టార్ లలో ఆక్వా సాగు జరుగుతోందని, ఈరంగంపై మొత్తం 1.38 లక్షల మంది రైతులు ఆధారపడి ఉన్నారని , 2.27 మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తుల్లో దేశంలోనే మనరాష్ట్రం మొదటి స్థానంలో వుందని అన్నారు. అలాగే మన జిల్లాలో 75 కిమీ సముద్ర తీర ప్రాంతం, 70 వేల మంది అక్వారంగం పై ఆధార పడివున్నారని అన్నారు. దాదాపు మన జిల్లాలో అక్వాసాగు చుస్తే 2381 హెక్టార్ల పైగా వుందని అన్నారు. మన తలసరి ఆక్వా ఉత్పత్తుల వినియోగం కేవలం 7 కేజీలు గా వుందని, అత్యంత పోషక విలువలు చేపలందు వున్నాయని, ఆరోగ్యవంతగా వుండాలంటే నిపుణల సూచనలమేరకు కనీసం 25 కేజీల తలసరి వినియోగం రావాలని అన్నారు.

ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఫిష్ ఆంధ్రా హబ్ లను ఏర్పాటు చేయాలన్న సంకల్పం మేరకే నగరంలో రాష్ట్రంలోనే మొదటి ఫిష్ ఆంధ్రా లాంజ్ కు శ్రీకారం చుట్టామని నగర మేయర్ శిరీషా అన్నారు లబ్దిదారు భావనజ్యోతి మహిళా కోటా కింద మంజూరు జరిగిందని జిల్లా కలెక్టర్ , మేయర్ లకు వివరిస్తూ రూ.50 లక్షల యూనిట్ విలువ రూ.30 లక్షల సభ్సిడీ , రూ.1.50 లక్షల పెట్టుబడితో బ్యాంక్ ఆఫ్ బరోడా రుణంగా రూ. 6.50లక్షలు అందిందని, తిరుపతి నగరంలో ఒక మంచి చేపలు, రొయ్యలు వంటివి అమ్మకంతో పాటు రెస్టారెంట్ ఏర్పాటు చేసామని, దీన్ని ప్రోత్సహించిన అధికారులకు ధన్యవాదాలని తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప మేయర్ ముద్రనారాయణ , జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస నాయక్ , ఎల్.డి.ఎం. సుబాష్ , బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ యాసిన్ బాష , కమిటీ సభ్యులు కిరణ్ కుమార్ , ఎస్.వి.యు ఆక్వాకల్చర్ హెడ్ నాగజ్యోతి, డి పి ఎం ధనుంజయ్ , వి.ఎఫ్.ఎ. సునీల్ కుమార్, హబ్ ఆపరేటర్ రాజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement