Thursday, May 2, 2024

కలి’విడి’గా కాంగ్రెస్ …నల్గొండ సభలో నేతల తీరు

…దటీజ్‌ కాంగ్రెస్‌! ఎన్నికల సమయానికి గ్రూపులన్నీ ఏకమవుతాయని మరోసారి నిరూపితమైంది… గెలుపు మంత్రం పాటిస్తూ నాయకులంతా ఒక్కటై సత్తా చూపుతారు…. తాజాగా నల్లగొండలో ఇది కళ్లకు కట్టింది… పీసీసీ అధ్యక్షుడు చేపట్టిన నిరసన ర్యాలీ, సభ దిగ్విజయమైంది… రేవంత్‌, కోమటిరెడ్డిలు వేర్వేరు దారుల్లో విడివిడిగా నిరసన ర్యాలీలు నిర్వహించి క్లాక్‌టవర్‌ వద్దకు చేరుకున్నారు… అక్కడ వేదికపై అసలు దృశ్యం ఆవిష్కృతమైంది… నేతలంతా ఆలింగనం చేసుకుని విజయ నినాదాలు చేయడం శ్రేణులకు కనువిందు చేసింది…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎడమోహం పెడ మోహంగా ఉండటం.. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే నాయకులు.. నల్లగొండలో నిర్వహించిన నిరుద్యోగ సభలో ఒక్కటయ్యారు. మా మధ్య విభేదాలు ఉన్నా.. సమయం వచ్చినప్పుడు ఐక్యంగా యుద్ధం చేస్తామని పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంత రావులు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతకు ముందు రామగిరి నుంచి టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నల్లగొండ క్లాక్‌సెంటర్‌ వరకు భారీ ర్యాలీగా వెళ్లగా.. ఎంపీ కోమటిరెడ్డి మాత్రం మరొచట నుంచి సభ వద్దకు ర్యాలీగా వచ్చారు. నల్లగొండ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి స్వాగతం చెప్పకుండానే.. మరో ర్యాలీ నిర్వహించడం పార్టీలో హాట్‌ టాఫిక్‌గా మారింది. ఇదే అంశం పార్టీ వర్గాల్లో చర్చగా మారింది.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ జెండాను ఎగురవేద్దాం.. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసుకుందాం.’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ. ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు, ఆరోగ్య శ్రీతో పాటు ఎన్నో కార్యక్రమాలను అమలు చేసుకుందామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలంటే.. విప్లవాల ఖిల్లా అయిన నల్లగొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లి నియోజక వర్గాలకు.. 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపించాలి. మిగతా నూటికి 90 సీట్లు తెచ్చే బాధ్యత మేం తీసుకుంటాం ‘ అని పార్టీ కార్యకర్తలకు ఆయన బరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుం టున్నారని తాము చెబితే ఖండించారని, ఇప్పుడు సీఎం కేసీఆరే లంచాలు తీసుకున్న వారి చిట్లా తన వద్ద ఉందని చెబు తున్నాడని, 30 శాతం కమీషన్లు తీసుకునే ప్రభుత్వం మనకు అవసరమా..? అని రేవంత్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. నల్లగొండలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన సభలో టీ పీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మండిపడ్డా రు. ‘ 12 వందల మంది బిడ్డలు ప్రాణ త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణలో పేదలు పేదలుగానే బతకాలా..? . కేసీఆర్‌ కుటుంబం రాజ్యం ఏలుతుంటే పేదల బిడ్డలు కుల వృత్తులు చేసుకుని బతకాలా..? నిరుద్యోగులు అడ్డా మీద కూలీల్లా బతకాల్సిందేనా..? ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది. పరీక్షలు నిర్వహించాల్సిన సీఎం కేసీఆర్‌.. పార్టీ విస్తరణ పేరుతో రాష్ట్రాలు తిరుగుతున్నాడు. బీఆర్‌ఎస్‌ అత్మీయ సమ్మెళనాలు జనాతా బారులో పర్మిట్‌ రూమ్‌ అడ్డాల్లా మారాయి. పంటలు నష్టపోయి రైతులు ఏడుస్తుంటే బీఆర్‌ఎస్‌ నేతలు ఆత్మీయ సమ్మెళనాలంటూ తాగి చిందులు వేస్తున్నా రు. ప్రశ్నా పత్రాలు బజార్లో దొరుకుతున్నాయి. అలాంటి కేసీఆర్‌ సర్కార్‌ను 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి ‘ అని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బిడ్డ ప్రియాంక గాంధీ వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్రానికి వస్తున్నారని, సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించే సభకు వేలాదిగా ఈ జిల్లా నుంచి తరలిరావాలని ఆయన కోరారు.

పదవుల త్యాగం ఈ జిల్లా నుంచే..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తొలి, మలి దశ ఉద్యమంలో పదవుల త్యాగంతో ప్రాణ త్యాగం చేసింది ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచేనని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తొలిదశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ, మలిదశ ఉద్యమంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు తెలంగాణ కోసం మంత్రి పదవులను త్యాగం చేశారని తెలిపారు. అంతే కాకుండా ఇదే జిల్లాకు చెందిన మలిదశ తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతచారి అని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. నల్లగొండ అంటేనే రావినారాయణ రెడ్డి, మల్లు స్వరాజ్యం, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, చకిలం శ్రీనివాసరావుతో పాటు బండెనక బండి కట్టి అని నైజాం సర్కార్‌ను ప్రశ్నించిన బండి యాదగిరి పుట్టిన గడ్డ ఈ నల్లగొండ అని ఆయన పేర్కొన్నారు. అలాంటి నేతలున్న నల్లగొండ లో ఎలాంటి నాయకులను చూస్తున్నామో ఓసారి ఆర్థం చేసుకోవాలన్నారు. దొరగారి సారాలో సోడా పోసేవారు ఈ జిల్లా నుంచి మంత్రి అయిండని.. ఇలాంటి వారితో జిల్లా కు గౌరవం ఉంటుందా..? అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. పదవులను ఎడమ కాలి చెప్పుతో సమానమన్న కేసీఆర్‌.. ఇప్పుడు సెలక్షన్లు, కలెక్షన్లు అంటూ మళ్లిd ఎన్నికల్లో పోటీ చేశారని ఆయన దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లా ప్రజలు బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఉద్యమం చేయలేనని కేసీఆర్‌ చేతులు ఎత్తేసి జానారెడ్డి ఇంటికి వస్తేనే జేఏసీ ఏర్పడిందని, ఆ తర్వాత తెలంగాణ కల సాకారమైందన్నారు.

పరీక్షలు రాయలేని పరిస్థితి ఉంది..
తెలంగాణలో లక్షలాది మంది బిడ్డల జీవితాలను వందల కోట్లకు కేసీఆర్‌, అతని కుటుంబం అమ్ముకుంటోంది. తెలంగాణలో పరీక్షలు రాయలేని పరిస్థితి ఉంది, సమైక్య రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు. కేసీఆర్‌.. బిడ్డను బిర్లా, అల్లున్ని అంబానీ, కొడుకును టాటాను చేసిన నువ్వు చార్లెస్‌గా మారడమేనా..? బంగారు తెలంగాణ. ఇదేనా తెలంగాణ మోడల్‌ అంటూ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
అవసరం వచ్చినప్పుడు ఐక్యంగా యుద్ధం చేస్తాం : జానారెడ్డి
జిల్లా నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికి.. యుద్ధం వచ్చినప్పుడు ఐక్యంగా పోరాడుతామవని మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. జిల్లాలో ఉన్న 12 అసెంబ్లిd సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో జిల్లాలోని 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే.. ఈ ఎనిమిదేళ్లలో కనీసం కాలువలు కూడా తవ్వలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే నల్లగొండకు జల కళ వస్తుందన్నారు.

- Advertisement -

కాంగ్రెస్‌కు కంచుకోట నల్లగొండ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
దశాబ్దాలుగా నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అని టీ పీసీసీ మాజీ అధ్యక్షడు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు అక్రమంగా ఇసక, మైనింగ్‌ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిచారు. ఎస్‌ఎల్‌బీసీ సోరంగం తొమ్మిదేళ్లలో ఒక ఇంచు కూడా ముందుకు వెళ్లలేదని, ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. మిషన్‌ భగీరథకు రూ. 40 వేల కోట్లు ఖర్చు పెట్టినా.. ఎండకాలం మొదలు కాకముందే నల్లగొండలో నీటి ఎద్దడి మొదలైందని ఆయన దుయ్యబట్టారు. నిరుద్యోగులు 40 లక్షలు ఉంటే.. ప్రభుత్వం వైఫల్యం కాదా..? అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిలదీశారు.

కేసీఆర్‌ మాయల మరాఠీ : ఎంపీ కోమటిరెడ్డి
కేసీఆర్‌ తన మాటలతో మాయలు చేసే మరాఠి అని, ఇప్ప టికే రెండుసార్లు మోసపోయామని, ఇక మూడోసారి మోస పోవద్దని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. దళిత బంధు లో 30 శాతం కమీషన్‌ తీసుకున్న ఎమ్మెల్యే జాబితా ఉంటే ఎందుకు బయటికి చెప్పడం లేదని ఆయన నిలదీశారు. ఒక ప్పుడు స్కూటర్‌ మీద తిరిగే మంత్రి జగదీష్‌రెడ్డికి 80 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఎలా వచ్చిందని, మంత్రి నిరంజన్‌రెడ్డికి 400 ఎకారాల భూమి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియమకాల కోసమని, అలాంటిది తెలంగాణ నీళ్లను ఏపీ సీఎం జగన్‌కు దోచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఇదే మన బలగం.. జిల్లాలో బీసీలకు మూడు సీట్లు ఇవ్వాలి : వీహెచ్‌
కాంగ్రెస్‌ పార్టీలో సామాజిక న్యాయం ఉంటుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు అన్నారు. ఇటీవల జరిగిన బసవేశ్వరస్వామి జయంతి వేడుకల్లో ‘జిత్‌నా హిస్సేదారి.. ఉత్‌నా బగేదారి’ అని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారని ఆయన గుర్తు చేశారు. నాయకులందరం కలిసే ఉన్నామని, ఇదే మన బలగమని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లిd సీట్లకు గాను 3 సీట్లు రిజర్వు ఉండగా, మరో 3 సీట్లను బీసీలకు ఇవ్వాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement