Friday, May 17, 2024

టీనేజ్ నందిని సారా అర్జున్.. తండ్రి కూడా న‌టుడే

నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది పొన్నియిన్ సెల్వ‌న్2. ఈ చిత్రంలో టీనేజ్ నందినిగా న‌టించింది సారా అర్జున్. .ఈ సినిమాలో నందిని పాత్రలో ఐశ్వర్యరాయ్ కనిపిస్తుంది. ఆమె ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆమె టీనేజ్ పాత్రతో మొదలవుతుంది. ఆ పాత్రను పోషించిన యువతి పేరు ‘సారా అర్జున్’. 2011లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ మొదలైంది. హిందీ .. తమిళ .. మలయాళ భాషల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అనేక పాత్రలలో మెప్పించింది. 2015లో ‘దాగుడుమూత దండాకోర్’ అనే సినిమాలో రాజేంద్రప్రసాద్ తో కలిసి నటించింది. ‘సారా అర్జున్’ తండ్రి కూడా నటుడే .. అతనే ‘రాజ్ అర్జున్’. పలు సినిమాలలోను .. వెబ్ సిరీస్ లలోను .. టీవీ సీరియల్స్ లోను ఆయన నటించాడు. తండ్రి బాటలోనే సారా అర్జున్ నటన దిశగా అడుగులు వేస్తోంది.దాంతో ఇప్పుడీమె గురించి చ‌ర్చిస్తున్నారు అంతా.

Advertisement

తాజా వార్తలు

Advertisement