Saturday, October 12, 2024

Breaking News : బాబూ మోహన్ కు ‘సన్’ స్ర్టోక్ …కారెక్కిసిన ఉదయ్ మోహన్

సిద్దిపేట‌ప్ర‌తినిధి, న‌వంబ‌ర్ 19(ప్ర‌భ‌న్యూస్‌)
అందోల్ నియోజకవర్గంలో బిజెపికి ఊహించని షాక్ తగిలింది. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బాబూమోహన్ కొడుకు ఉదయ్ బాబూమోహన్ బిఆరెస్ లో చేరారు. ఆదివారం సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ సమక్షంలో బిఆరెస్ తీర్థం పూచ్చుకున్నారు.

ఉదయ్ బాబూమోహన్ తో పాటు అందోల్ బీజేపీ ముఖ్య కార్యకర్తలు, క్యాడర్ మొత్తం మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో బిఆరెస్ లో చేరారు. వీరందరికి మంత్రి హరీష్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్‌లో చేరిన వారిలో నవీన్, సయ్య సాయి, శేఖర్ గౌడ్, సాయినాథ్, అర్జున్, లక్ష్మణ్, రాఖేష్, గోవింద్, రవి, నరేష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ బిక్షపతి, బిఆరెస్ రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డి, రైల్వే బోర్డు మెంబెర్ కాశినాథ్ తో పాటు పలువురు బిఆరెస్ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement