Saturday, May 4, 2024

బస్టాండ్లలో గుట్కా బంద్‌.. ఆర్టీసీ సిబ్బందికి ఎండీ వార్నింగ్

ఆర్టీసీ బస్సులతో పాటు సంబంధిత ప్రాగంణాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం కార్యక్రమాలను విధిగా పాటించాలని TS RTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సులో కానీ, బస్‌స్టేషన్‌ ప్రాంగణంలోకానీ గుట్కా, ఖైనీ, పాన్‌మసాలా వంటివి వాడకూడదని సజ్జనార్‌ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రీజినల్‌ మేనేజర్లు, డివిజినల్‌ మేనేజర్లు, డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీచేశారు. కొందరు డ్రైవర్లు, ప్రయాణికులు పాన్‌, గుట్కా, పాన్‌మసాలా వంటివి నమిలి బస్సులో, బయట ఉమ్మడం సరైంది కాదన్నారు. ఇది సంస్కారవంతులు చేసే పనికాదని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని ఆర్టీసీ సిబ్బందిపైన కూడా చర్యలు ఉంటాయని సజ్జనార్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: టీ-24 సేవలు.. రూ.100కే సిటీ ప్రయాణం

Advertisement

తాజా వార్తలు

Advertisement