Saturday, April 27, 2024

TS: ముగిసిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌.. భారీగా నమోదైన పోలింగ్‌ శాతం

Huzurabad: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. పోలింగ్‌ శాతం భారీగా నమోదైనట్లు తెలుస్తోంది. కాగా ఈనెల 2న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు వెలుబడనున్నాయి. పోలింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి గంటకూ పోలింగ్‌ శాతం పెరుగుతూ వచ్చింది.

హుజూరాబాద్‌ బైపోల్‌లో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 10.5 శాతం పోలింగ్‌ నమోదైంది. 9 గంటల నుంచి 11 గంటల వరకు 33.27శాతం‌, 11 గంటల నుంచి ఒంటి గంట వరకు 45.63 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు 61.66 శాతం, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు ఎన్నికల అధికారి తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement