Thursday, May 2, 2024

TS – రాష్ట్రంలో మరిన్ని బదిలీలు.. ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో మరిన్ని బదిలీలు జరగనున్నాయి. ఇన్ని రోజులు సొంత జిల్లాలో పనిచేసిన అధికారులు, ఒకే జిల్లాలో మూడు సంవత్సరాలు పూర్తి చేసిన అధికారులను ఇటీవల జరిగిన బదిలీలో పక్క జిల్లాకు బదిలీ చేశారు.

అయితే ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వుల ప్రకారం ఒకే పార్లమెంటు పరిధిలో మూడు సంవత్సరాలు పని చేసినా, పార్లమెంటు పరిధిలో సొంత జిల్లా ఉన్న అధికారులను ఈనెల 26 న మధ్యాహ్నం మూడు గంటలలోగా బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది దేనితో పోలీసు, రెవెన్యూ శాఖలతో పాటు అన్ని శాఖల్లో పెద్ద ఎత్తున బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement