Friday, May 3, 2024

Medaram – నేడే జన దేవతల వన ప్రవేశం

మేడారం బృందం, ఫిబ్రవరి 24 ప్రభ న్యూస్ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహాజాతర అంగరంగ వైభంగా జరుగుతోంది. మూడోరోజు జాతరలో భాగంగా అమ్మవార్లు గద్దెలపై కోలువుదీరడంతో దర్శనాలకు భక్తజనం బారులుతీరారు.ముందుగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకున్నారు. ప్రముఖులు, రాజకీయనాయకులు సైతం వనదేవతల దర్శనానికి తరలివచ్చారు. దీంతో సాధారణ దర్శనానికి రెండు నుంచి ఐదుగంటల సమయం పట్టింది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతడాలుగా మేడారానికి క్యూ కట్టారు.

దీంతో ములుగు జిల్లా మేడారం సమీపంలోని ప్రాంతాలలో ట్రాఫిక్ స్తంభించింది. మహాజాతర చివరి అంకాని చేరుకొవడంతో భక్తులు భారీ సంఖ్యలో రానున్నట్లు చెబుతున్నారు. కాగా ఇవాళ సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకెళ్లనున్నారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమభరిణెతో పూజారులు వన ప్రవేశం చేయడంతో మహాజాతర ముగుస్తుంది.

అయితే ఇప్పటి వరకు మేడారంలోని సమ్మక్క, సారలమ్మలను 1.20 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. గత నెల రోజుల నుంచి జాతర ముందు వరకు 50 లక్షల మంది, జాతర టైంలో 70 లక్షల మంది భక్తులు అమ్మలను దర్శించుకున్నారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇవాళ జాతర చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement