Sunday, May 19, 2024

TS: బీజేపీతోనే గిరిజన, దళితులకు గౌరవం… కేంద్ర మంత్రి మురుగ‌న్

అచ్చంపేట, మే 5, ప్రభ న్యూస్ : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు తీసుకున్న తర్వాతనే ఈ దేశంలోని గిరిజనులకు, దళితులకు సమాజంలో అన్ని రంగాల్లో ప్రాధాన్యతను ఇవ్వడమే కాక అత్యున్నతంగా గౌరవించి వారిని అన్ని రంగాలలో సత్కరించిందని కేంద్ర ప్రసార, పశుసంవర్ధక శాఖ మంత్రి మురుగన్ అన్నారు. ఆదివారం అచ్చంపేట పట్టణంలోని శంషు ఫంక్షన్ హాల్ లో బీజేపీ పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజనుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ… కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు తీసుకున్న అనంతరం దళిత, ఆదివాసి గిరిజన మహిళలకు ఈ దేశ ప్రథమ పౌరులైన రాష్ట్రపతి పదవినిచ్చి వారిని అత్యున్నతంగా గౌరవించిన ఘనత ప్రధానమంత్రి మోడీకే దక్కుతుందన్నారు. ప్రధానమంత్రి మోడీని మూడోసారి కూడా ప్రధానమంత్రిగా గెలిపించేందుకు నాగర్ కర్నూల్ బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.

నా వారసుడిగా భరత్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి… ఎంపీ పోతుగంటి రాములు
75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అభివృద్ధికి నోచుకోని ఎస్సీ ఎస్టీలకు బీజేపీతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు ఇదే సమావేశంలో అన్నారు. 30 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నీతి నిజాయితీలే శ్వాసగా జీవించానని, నా వారసుడిగా విద్యావంతుడైన నా కొడుకు భరత్ ను మీ సేవకై తీసుకొస్తున్నానని, కమల పువ్వు గుర్తుపై ఓటు వేసి బ్రతుకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించి మోడీ మూడోసారిగా ప్రధానమంత్రి అయ్యేలా మీరంతా దీవించాలని గిరిజనులను ఉద్దేశించి ఆయన కోరారు.

- Advertisement -

బిజెపి బలపరిచిన పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ను మే 13 వ తారీఖున పువ్వు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి, మరోసారి మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేలా మీరంతా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా జాతీయ నాయకులు మంగ నాయక్, రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కళ్యాణ్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి గణేష్, రాష్ట్ర నాయకులు మండికారి బాలాజీ, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ముక్తాల రేనయ్య, కౌన్సిలర్ సుగుణమ్మ, మహిళా నాయకురాలు బలమూరు జానకి, తేజ, స్థానిక నాయకులు పత్య నాయక్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement