Monday, May 6, 2024

Top Story – అక్క‌డ ప‌ట్టు సాధిస్తే విజ‌యం మ‌నేదే…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో అధికారాన్ని -కై-వసం చేసుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్‌ నియోజక వర్గాలు అత్యంత కీలకమని భావిస్తున్న బీజేపీ ఆ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలుం డగా 31 రిజర్వుడ్‌ నియోజకవర్గాలున్నాయి. ఇందులో 19 ఎస్సీ, 12 ఎస్టీ స్థానాలున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు- చేయాలంటే మేజిక్‌ ఫిగర్‌ 60 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందాల్సిన అవసరం ఉంది. రిజర్వుడ్‌ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికల్లో గురిపెట్టి కొడితే మెజార్టీ సెగ్మెంట్లలో విజయం సాధించవచ్చన్న ధీమాతో ఉన్న భాజపా 25 రోజుల పాటు- ఆయా నియోజక వర్గాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక లు సిద్ధం చేసింది రెండు వారాల పాటు- పార్టీ అగ్రనేతలంతా రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో మకాం వేసి ప్రజలతో మమేక మయ్యేలా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్టు- ప్రచారం జరుగుతోంది. ఇందుకు అవసరమైన కార్యాచరణ ను ఇప్పటికే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు సిద్ధం చేసినట్టు- సమాచారం. రిజర్వుడ్‌ సెగ్మెంట్లలో కార్యక్రమాల నిర్వహణకు పార్టీ పరంగా ఉప సంఘాలను కూడా నియమిం చాలన్న నిర్ణయానికి వచ్చినట్టు- సమాచారం. ఏకబిగిన 25 రోజుల పాటు- కొనసాగించనున్న కార్యక్రమాలకు ఆయా సామజిక వర్గాలకు చెందిన కేంద్ర మంత్రులను, దళిత, గిరిజన మహిళా యువమోర్చలకు చెందిన కీలక నేతలను ఆహ్వానించేందుకు పణాళికలు సిద్ధం చేసినట్టు- చెబుతున్నారు.

దళిత గిరిజన వర్గాలకు చెందిన నివాసాల్లో ఉంటూనే వారితో మమేకం కావాలని గిరిజన గూడాలు, లంబాడి తండాలలో రాత్రి నిద్ర చేయాలని నిర్ణయించినట్టు- సమాచారం. దళిత గిరిజన వర్గాలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమా లను వివరించడంతో పాటు- భాజపా రాష్ట్రంలో అధికారాన్ని -కై-వసం చేసుకుంటే అమలు చేసే పథకాలను వివరించాలని సంకల్పించినట్టు- సమాచారం. ఎస్సీ నియోజకవర్గాలలో పార్టీ తరపున పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించి ఆ వర్గాలకు చేరువయ్యేందుకు మాజీ లోక్‌సభ సభ్యుడు ఏపీ జితేందర్‌ రెడ్డిని, ఎస్టీ సెగ్మెంట్లకు మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావును భాజపా అధినాయకత్వం ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. ఈ ఇద్దరు అగ్రనేతలు రిజర్వుడ్‌ నియోజక వర్గాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేయడంతో పాటు- ఎన్నికల్లో సమర్థులైన అభ్యర్థులను గుర్తించి వారి పేర్లను పార్టీ పెద్దలకు తెలియపరుస్తారని సమాచారం. ఈ అభ్యర్థులలో ఎవరిని ఎంపిక చేస్తే ప్రయోజనం ఉంటు-ందో తెలుసుకునేం దుకు సర్వే జరిపించి గెలుపునకు అవకాశం ఉన్న వారి పేర్లను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు- సమాచారం.

ఎస్సీలకు ఇచ్చిన హామీలపై పోరు
తమ పార్టీ అధికారంలో రాగానే దళితులను ముఖ్య మంత్రిని చేస్తానని, అలా చేయకపోతే తల నరుక్కుంటానని ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన విషయాన్ని తమ పర్యటనల్లో చర్చనీయాంశం చేసేందుకు భాజపా సమాయత్తమవుతోంది. దళిత ముఖ్య మంత్రి హామీని నిలబెట్టు-కోలేదని, అదే సామజిక వర్గానికి చెందిన రాజయ్యను ఉప ముఖ్యమంత్రిని చేసి అకారణంగా పదవి నుంచి తప్పించిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఊసేలేదని గుర్తుచేయనుంది. దళిత బంధు పథకం కొందరికే పరిమితం చేశారని, ఈ పథకంలో భారాస ఎమ్మెల్యేలు, ప్రజాప్రనిధులు చేతి వాటం ప్రదర్శిస్తున్నా సీఎం కిమ్మనక పోవడంలో గల ఆంతర్యాన్ని ప్రశ్నించనున్నట్టు- తెలుస్తోంది. దళితులపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులు, సంఘ బహిష్కరణలు, దళిత మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రతిపాదించి నట్టు- చెబుతున్నారు. దళిత, గిరిజన వాడల్లో అంటరానితనం ఇంకా జరుగుతూనే ఉందని, ఈ వర్గాలకు సమాజంలో రక్షణ కరువైందన్న విషయాన్ని లోతుగా ఈ వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లి తమకు అనుకూలంగా మలుచుకోవాలని భాజపా భావిస్తోంది. భారాస అధికారంలోకి వచ్చాక చాలా రోజుల వరకు దళిత వర్గాలకు మంత్రివర్గంలో చోటు- కల్పించని విషయాన్ని కూడా ప్రస్తావించాలని ఇప్పుడున్న మంత్రి కొప్పు ల ఈశ్వర్‌ ఎస్‌సీలో ఒక తెగకు చెందిన వారని మాదిగలను కేసీఆర్‌ ప్రభుత్వం తొక్కి వేసిందన్న సమాచారాన్ని విస్తృతం గా దళితుల్లోకి తీసుకెళ్లే ప్రణాలికను రూపొందించే పనిలో ఉన్నట్టు- సమాచారం.

ఉన్నత స్థాయి సమావేశం.. అగ్రనేతలు బన్సల్‌, తరుణ్‌ చుగ్‌ హాజరు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 31 రిజర్వుడ్‌ సెగ్మెంట్లలో గెలుపుపై ప్రత్యేకంగా దృష్టి సారించిన భాజపా ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమా వేశం నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిలు తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్‌ నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ సెగ్మెంట్ల కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వ్‌డ్‌ సెగ్మెంట్లు-న్నాయి. వచ్చే ఎన్నికల్లో అనుసరిం చాల్సిన వ్యూహం.. స్థానికంగా ప్రభావితం చూపే అంశాలపై నియోజకవర్గాల వారీగా చర్చించారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తదితరులు హాజరయ్యారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 15 వరకు ఎస్సీ రిజర్వుడ్‌ సెగ్మెంట్లలో బీజేపీ నేతలు పర్యటించాలని నిర్ణయించినట్టు- తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement