Sunday, May 5, 2024

Rain Rain | హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. ప‌లు చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు

హైదరాబాద్ లో ఇవ్వాల (శ‌నివారం) ఉద‌యం నుంచి వర్షం కురుస్తోంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం, మ‌రికొన్ని చోట్ల మోస్త‌రు జ‌ల్లులు కురుస్తున్నట్టు స‌మాచారం. ఈ మ‌ధ్య కాలంలో ఎండ‌ల‌తో కాస్త ఉక్క‌పోత‌ను అనుభ‌వించిన సిటీ జ‌నం వాతావ‌ర‌ణం కూల్‌గా మార‌డంతో హ్యాపీగా ఉన్నారు. ఉద‌యం నుంచి మ‌బ్బులు క‌మ్ముకుని చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఆహ్లాద‌క‌రంగా మారింది.

వ‌ర్షంతో రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఉద‌యం ఆఫీసుల‌కు, స్కూల్‌కు వెళ్లే వారు వాన‌తో ఇబ్బందులు ప‌డ్డారు. రోడ్ల మీద ట్రాఫిక్ నిలిచిపోయింది. మదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట, ప్ర‌గ‌తిన‌గ‌ర్‌, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్ నగర్, లోయర్ ట్యాంక్ బండ్ లో వర్షం కురుస్తున్న‌ట్టు స‌మాచారం.

హబ్సీగూడ, రామంతాపూర్, ఉప్పల్, సరూర్ నగర్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, ఎల్ బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, జీడిమెట్ల, కొంపల్లి, సూరారం, షాపూర్ నగర్, కుత్బుల్లాపూర్, చింతల్, జగద్గిరిగుట్ట, దుండిగల్, బహదూర్ పల్లి తదితర ప్రాంతాల్లో వాన కురిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement