Monday, April 29, 2024

ధర్మం – మర్మం : ఋషిప్రబోధములు – దానము(12) (ఆడియోతో…)

మహాభారతంలోని ఋషిప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

అను నీయ యధాకామం సత్యసంధో మహా వ్రత:
స్వప్రాణౖ: బ్రాహ్మణ ప్రాణాన్‌ పరిత్రాయ దివంగత:

ఇచ్ఛానుసారంగా ధర్మమును అనుసరించి, సత్య వ్రతమును పాటించిన కాశీరాజు తన ప్రాణములతో బ్రాహ్మణుల ప్రాణాలను కాపాడి స్వర్గమునకు వెళ్ళెను. తన ప్రాణములతో ఏ ప్రాణి ప్రాణములను కాపాడినా స్వర్గము లభించునని మహాభారతంలోని ఈ శ్లోకమునకు నీలకంఠుల వారు వ్యాఖ్యానం చేశారు. ప్రాణి అనగా మానవుడే కాదు పశువులు, పక్షులు, జంతువులు ప్రాణమున్న ఏ జీవి ప్రాణాలు కాపాడినా ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయని తెలియజేశారు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement