Monday, April 29, 2024

NLG: తిరుమలగిరి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. నెగ్గిన అవిశ్వాసం

తిరుమలగిరి, మార్చి 20 (ప్రభ న్యూస్) : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ పోతరాజు రజనీపై అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాస తీర్మానానికి 12 మంది కౌన్సిలర్లు ఎక్స్ ఆఫీషియల్ ఎమ్మెల్యే పాల్గొని అందరూ అవిశ్వాసానికి చేతులెత్తారు.

దీంతో మున్సిపల్ చైర్ పర్సన్ అవిశ్వాసం నెగ్గ‌డం జరిగిందని సూర్యాపేట ఆర్డీఓ వేణు మాధవరావు తెలిపారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. అవిశ్వాస తీర్మానం పూర్తయిన తర్వాత కార్యాలయం ముందు కౌన్సిలర్లతో కలిసి ఉంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ విజయ సంకేతం చూపారు. మధ్యాహ్నం రెండు గంటలకు మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం తీర్మానం ఉంటుందని ఆర్డిఓ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement