Thursday, May 2, 2024

National : లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు…డీఎంకే మేనిఫెస్టో విడుదల…

లోక్‌సభ ఎన్నికలకు ముందు త‌మిళ‌నాడులో డీఎంకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. సీఎం స్టాలిన్, ఎంపీ కనిమొళి, పార్టీ నేతల సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ, స్టాలిన్ సోదరి కనిమొళి, ఇతర పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు.

- Advertisement -

అదనంగా, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా పార్టీ ప్రకటించింది. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, నీట్ పరీక్షలపై నిషేధాన్నిమేనిఫెస్టోలో పొందుపరిచారు. పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను రూపొందించేది డీఎంకేయేనని, మేం చెప్పినట్లే చేస్తామని , ఇదే మా నాయకులు మాకు నేర్పించినదని అన్నారు. డీఎంకే ఎన్నికల మెనిఫెస్టో ద్రావిడ మొడల్ ను భారత దేశం మొత్తం తీసుకు వెళ్లేందుకు ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు చెప్పారు. తమిళనాడులో మెజార్టీ సీట్లను డీఎంకే విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement