Thursday, November 14, 2024

TS : మహబూబ్‌న‌గ‌ర్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్…

మహబూబ్‌న‌గ‌ర్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్ త‌గిలింది. జిల్లా పరిషత్ చైర్ ప‌ర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -

గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి అమరచింత అసెంబ్లీ నియోజకవర్గంలో నుండి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన స్వర్ణ సుధాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో తన సొంత మండలం చిన్నచింతకుంట నుండి కాకుండా భూత్పూర్ మండలం నుండి బీఆర్ఎస్ నుండి పోటీ చేసి జడ్పీ చైర్ పర్సన్ గా ఆమె ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement