Monday, April 29, 2024

Breaking: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు సీజే అలోక్ అరాధే గవర్నర్ చేత ప్రమాణం చేయించారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో నిర్వహించిన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌ గా ఉన్న రాధాకృష్ణన్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. సీపీ రాధాకృష్ణన్ 2023 ఫిబ్రవరి 18 నుంచి ఝార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 11.15 గంటలకు రాజభవన్ లో తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement