Sunday, April 28, 2024

TS Budget: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్… రేపు కేబినేట్ స‌మావేశం

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఈ నెల 8 తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి రేపు కేబినేట్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈస‌మావేశంలో బ‌డ్జెట్ పై చ‌ర్చించనున్నారు. గవర్నర్ ప్రసంగంతో ఉభయసభలు మొదలు కానున్నాయి.

మంత్రి వర్గం సమావేశం తరువాత బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ఈ సమావేశాలు ఉండనున్నాయి. తొలి ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. తొమ్మిదో తేదీన గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. పదో తేదీన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 12 నుంచి ఐదు రోజులపాటు సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటైన తరువాత తొలిసారి బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రధాన పార్టీల నాయకులు వ్యవహారశైలి, వాడి, వేడి చర్చ జరిగే అవకాశముందని అంతా భావిస్తున్నారు. అసెంబ్లీకి ఎన్నికైన తరువాత గురువారం ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. నెల రోజులు కిందట నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొనలేదు. సర్జరీ తరువాత కేసీఆర్‌ కోలుకోవడంతోపాటు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన నేపథ్యంలో.. ఆయన బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనే అవకాశముందని చెబుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement