Sunday, April 28, 2024

TS: కేంద్రంలో రాబోయేది ఇండియా కూటమే.. చాడ వెంకట్ రెడ్డి

కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీపీఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశం ప్రకాష్ అధ్యక్షతన స్థానిక జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ… దేశంలో రెండవ సారి వచ్చిన నరేంద్ర మోడీ సర్కార్ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అదేరకంగా విభజన హామీలకు సంబంధించి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజిపేట్ రైల్వే కోచ్, గిరిజన యూనివర్సిటీ జిల్లాకు ఒకటి ఏర్పాటు చేస్తానన్న ప్రభుత్వం హామీలు అమలుగానే మిగిలిపోయాయన్నారు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న సమయంలో మతోన్మాదం పేరుతో రామ మందిరం పేరుతో దేశాన్ని హిందుత్వ దేశాంగా తన ఎజండాను ముందుకు తీసుకుపోయే కార్యక్రమానికి పూనుకుందన్నారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికలు దేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పార్టీలు అన్నీ ఒక ఐక్య పార్టీగా ఇండియా కూటమిగా ఏర్పడి కేంద్రంలోనూ బీజేపీని మోడీ సర్కారుని ఓడించడమే లక్ష్యంగా పని చేయడానికి కమ్యూనిస్టు పార్టీతో పాటు వామపక్ష పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మొన్న జరిగినటువంటి సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు అందరూ కలిసి ఏఐటీయూసీని అధిక మెజారిటీ తో గెలిపించిన కార్మిక వర్గానికి సీపీఐ జేజేలు తెలిపారన్నారు. మొన్న ఎన్నికల్లో సీపీఐ మద్దతుతో గెలుపొంది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి, దానికి కమ్యూనిస్టు పార్టీ పూర్తి సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందంతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు గోషిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, కడారి సునీల్, కోడెం స్వామి, చంద్రగిరి ఉదయ్, మాటేటి శంకర్, ఆరెపల్లి మానస్ కుమార్, రాజారత్నం, మల్లారెడ్డి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement