Tuesday, May 7, 2024

Ind vs Sa 2nd Test | సౌతాఫ్రికా జ‌ట్టుకు భారీ షాక్‌..

సెంచూరియ‌న్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచ్‌లో భార‌త్ పై విజ‌యం సాధించి మంచి జోష్‌లో ఉన్న ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. తొలి టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెప్టెన్ టెంబా బౌమా ఇప్పటికే రెండో టెస్టుకు దూరమయ్యాడు. తాజాగా మ‌రో ఆట‌గాడు కూడా రెండో టెస్టు నుంచి త‌ప్పుకున్నాడు. యువ పేస‌ర్ గెరాల్డ్ కోయెట్జీ రెండో టెస్టుకు దూరమైనట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది. అత‌ను పెల్విక్ ఇన్‌ఫ్లమేషన్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

భార‌త్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు : డేవిడ్ బెడింగ్‌హామ్, నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, డీన్ ఎల్గర్ (కెప్టెన్‌), మార్కో జాన్సెన్‌, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, లుంగీ ఎంగిడి, కీగన్ పీటర్‌సన్, కగిసో ర‌బాడ, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీప‌ర్‌).

Advertisement

తాజా వార్తలు

Advertisement