Monday, May 6, 2024

Guntur Kaaram | ‘కుర్చి మడతపెట్టి’ ఫుల్ సాంగ్ రిలీజ్..మహేష్ బాబు ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్

YouTube video

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ప్రధాన పాత్రలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్ ‘గుంటూరు కారం’. మహేష్ బాబుని పక్కా మాస్ రోల్‌లో చూపిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా, ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్‌ ‘కుర్చి మడతపెట్టి..’ అనే సాంగ్ ప్రోమోను నిన్న విడుదల చేయగా, తాజాగా పూర్తి పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్‌లో మహేష్, శ్రీలీల మాస్ డాన్స్ అదిరిపోయింది.

థమన్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా సాహితీ చాగంటి, శ్రీకృష్ణ కలిసి ఈ పాటను పాడారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఈ పాటను విడుదల చేశారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రాబోతుంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, గ్లింప్స్, మహేష్ బాబు మాస్ పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement