Saturday, May 4, 2024

NZB: ప్రజల ప్రగతికోసమే ప్రజాన్యాయ పీఠాలు..

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 30(ప్రభ న్యూస్): మానవ సమాజంలో మానవ సంబంధాలే ముఖ్య మని, కక్షలు, కార్పణ్యాలు విచ్చిన్నానికి దారి తీస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. పౌరుల మధ్య పొరపచ్చాలు, పగలు, ప్రతీకారాలు ప్రమాదకర హేతువులని, హేతుబద్ధంగా జీవించడమే నేర్చుకోవాలని ఆమె కోరారు. జాతీయ లోక్ అదాలత్ ను జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవసదన్ లో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషినల్ డిప్యూటీ పొలీస్ కమిషనర్ జయరామ్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ప్రజా సమూహాలు చట్టానికి లోబడి జీవించాలని చట్టం వ్యతిరేకమైన జీవనశైలి, చర్యలు చట్టవ్యతిరేకమైనవని ఆమె అన్నారు. వ్యక్తులతో వ్యవస్థ నిర్మాణం అయ్యిందని, ఆ వ్యవస్థ కొన్ని నియమాలతో పయనిస్తోందని తెలిపారు. వ్యవస్థ సాఫీగా నిర్వహించేందుకు చట్టాల అవసరం ఏర్పడిందని, చట్టాలను అనుకరించడమే చేయాలని కోరారు. పౌరుల మధ్య దీర్ఘకాలిక శత్రుత్వాలు కొనసాగరాదనే లక్ష్యంతో లోక్ అదాలత్ లు నిర్వహిస్తూ.. అన్నిరకాల సివిల్ దవాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు పరిష్కరించడం జరుగుతున్నదని ఆమె వివరించారు.

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ… పదకొండేళ్ళుగా కొనసాగుతున్న ఒక సివిల్ వివాదాన్ని న్యాయసేవ సంస్థ సహకారంతో పరిష్కరించుకుని భీంగల్ భూనష్ట పరిహార బాధితులకు 3 కోట్ల 90 లక్షల బ్యాంకు చెక్ ను అందజేసి ముగింపు పలికినట్లు తెలిపారు. ట్రాపిక్ చలాన్లు వాహన దారులచే వసూలు చేయించడంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంటే నిజామాబాద్ జిల్లా రెండవ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. ఏ పరిష్కారమైనా అది జిల్లా అభివృద్ధికి చిహ్నమేనని అన్నారు. సామరస్యపూర్వక పరిష్కారమే అన్ని సమస్యలకు కారణభూతమని ఆయన పేర్కొన్నారు. మతపరమైన కేసులు తప్ప అన్ని రకాల రాజీపడదగిన క్రిమినల్ కేసులు లోక్ అదాలత్ లో పరిష్కారమయ్యే విధంగా పోలీసుశాఖ న్యాయసేవ సంస్థకు తన బాధ్యతగా సహకరిస్తున్నదని అడిషినల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ జయరామ్ తెలిపారు.


3.కోట్ల 90 లక్షల చెక్ అందజేత…
ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ లోని భీంగల్ మండల కేంద్రంలో పేదలకు ఇళ్ళ స్థలాలు సేకరించడం మూలంగా భూ నిర్వాసితులైన వారికి 3 కోట్ల 90 లక్షల చెక్ ను జిల్లా జడ్జి సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూర్ ఆర్.డి.ఒ వినోద్ లతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, అదనపు జిల్లాజడ్జి ఆశాలత, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు, బార్ అధ్యక్షుడు దేవదాసు, ఉపాఢ్యక్షుడు ఆశ నారాయణ, న్యాయసేవాధికార సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement