Thursday, May 2, 2024

Exclusive | ప్రాణాలు తీసిన ప్రభుత్వ నిర్లక్ష్యం​.. చిన్నారి పైనుంచి వెళ్లిన స్కూలు బస్సు

హైదరాబాద్​లో ఘోరం జరిగింది. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లి రెడ్డీస్ ల్యాబ్ వద్ద రోడ్డుపై ఉన్న గుంత కారణంగా ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్లుండగా గుంతలో పడి ఎగిరేయడంతో ఓ 8 ఏళ్ల చిన్నారి కిందపడిపోయింది. అదే క్రమంలో వెనకనుంచి వచ్చిన స్కూలు బస్సు చిన్నారి మీద నుంచి వెళ్లడంతో ఆ పాప అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటన ఇవ్వాల (బుధవారం) ఉదయం జరిగింది.

– కుత్బుల్లాపూర్​ / బాచుపల్లి, (ప్రభ న్యూస్)

భౌరంపేటలోని ఇంద్రప్రస్థ అపార్ట్​మెంట్​లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిశోర్ కి ఏమిదేండ్ల చిన్నారి ఉంది. ఆ పాప (దీక్షిత) బౌరంపేట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో మూడో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం తన తండ్రి చిన్నారిని స్కూల్ లో దింపేందుకు స్కూటీ పై తీసుకెళ్తుండగా రెడ్డీస్ ల్యాబ్ దగ్గర రోడ్డుపై ఉన్న గుంత కారణంగా సడెన్​ బ్రేక్​ వేయడంతో పాప కిందపడిపోయింది. ఇంతలో వెనుక నుండి వచ్చిన మరో వాహనం వీరిని ఢీ కొట్టడంతో స్కూటీ కూడా కింద పడింది. ఈ ఘటనలో స్కూటీ నడుపుతున్న కిశోర్​​ ఎడమ వైపు పడగ, వెనుక కూర్చున్న చిన్నారి కుడి వైపు పడిపోయింది.

అయితే.. ఆ వెనుక నుండి వస్తున్న భాష్యం స్కూల్ బస్సు పాపపై నుండి వెళ్లడంతో చిన్నారి అక్కడిక్కడే చనిపోయింది. చిన్నారి తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. అతను ప్రస్తుతం మమతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న సెక్టార్ ఎస్సై రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనా తీరును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుండెలవిశేలా రోధించిన తల్లి
దీక్షిత బస్సు కింద పడి మృతి చెందిందన్న విషయం తెలుసుకున్న పాపత తల్లి గుండెలవిసేలా విలపిస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద కూర్చుని గుండెలు పగిలేలా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. ఇప్పుడే తయారు చేసి స్కూల్ కు పంపా కదా తల్లి ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయిందా దేవుడా మాపై ఇంత కఠినమా అంటూ విలపించింది. ఆమె రోదనలు చూసి పలువురు కంట తడి పెట్టుకున్నారు.

- Advertisement -

గుంతల రోడ్డే పాప మృతికి కారణం: ఆకుల సతీష్, బీజేపీ ఎన్ఎంసి ప్రెసిడెంట్

వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లపై అడుగు లోతు గుంతలు పడ్డాయని, వాటిని పూడ్చక పోవడంతోనే ఈ యాక్సిడెంట్​ జరిగి పాప ప్రాణాలు పోయాయని బీజేపీ నేత ఆకుల సతీశ్​ మండిపడ్డారు. ప్రమాదంలో అభం శుభం తెలియని చిన్నారి మృతిచెందిందన్నారు. దీనికి నిజాంపేట్ కార్పొరేషన్ పాలకమండలి, అధికారులే బాధ్యత వహించాలన్నారు. బాధిత కుటుంబానికి బిజెపి అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement