Thursday, May 2, 2024

Breaking: బాచుపల్లిలో విషాదం… చిన్నారి ప్రాణం తీసిన రోడ్డు గుంత

హైదరాబాద్ : హైదరాబాద్ బాచుపల్లిలో విషాదం నెలకొంది. రోడ్డు గుంత చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో రెండో తరగతి చదువుతున్న పాప మృతిచెందింది. తండ్రితో టూ వీలర్ మీద స్కూలుకు వెళుతున్న సమయంలో బైకు గుంతలో పడింది. దీంతో బైక్ పై నుంచి జారి కింద పడిపోయింది చిన్నారి. అదే సమయంలో అటుగా వస్తున్న స్కూల్ బస్సు చిన్నారిపై నుంచి వెళ్ళింది. బాచుపల్లి రెడ్డీస్ ల్యాబ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement