Thursday, May 2, 2024

TS: ముగిసిన సీఎల్పీ స‌మావేశం.. ఇక నిర్ణ‌యం ఖ‌ర్గే దే

హైదరాబాద్ లోని హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశం ముగిసింది. సీఎల్పీ నేత ఎంపికను ఏఐసీసీకి అప్పగిస్తూ సీఎల్పీ ఏకవాక్య తీర్మానం చేసింది. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏక‌వాక్య తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని ఖమ్మం ఎమ్మెల్యే, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బలపరిచారు. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపారు… ఆయన నుంచి తుది నిర్ణయం వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి ..

ఇక ప్రమాణ స్వీకారానికి వీలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు తరలివెళ్లనున్నారు. ఎమ్మెల్యేలను తరలించడానికి వీలుగా ఇప్పటికే బస్సులను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి, ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం ఈరోజే రాజ్ భవన్ లో జరుగుతుందని అంటున్నారు… ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారైందనీ, అధిష్ఠానం ప్రకటించడమే తరువాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. సీఎల్పీ భేటీకి పరిశీలకులు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, జార్జి, దీపా దాస్ మున్షీ, మురళీధరన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement