Sunday, May 5, 2024

MDK: కల్వర్టును ఢీ కొట్టిన కారు.. వ్యక్తి మృతి

బెజ్జంకి, జనవరి 9(ప్రభ న్యూస్) : అదుపుతప్పి కారు కల్వర్టును ఢీకొట్టడంతో వ్యక్తి మృత్యువాత పడిన సంఘటన గురువారం మండల పరిదిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో గల రాజీవ్ రహదారిపై చోటు చేసుకుంది.

కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయని, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. మృతుడు జగిత్యాల వాసిగా గుర్తించారు. హైదరాబాద్ నుండి జగిత్యాల వెళ్తున్నట్లుగా సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement