Sunday, April 28, 2024

Delhi: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..

దేశరాజధాని ఢిల్లీలో నరేలా ప్రాంతంలో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఓ ఫ్యాక్టరీ లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఆ మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి.

దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో సమీపంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement