Thursday, May 2, 2024

Bandi Sanjay: అప్పులో ఉన్న రాష్ట్రంలో ఆరు హామీలు ఎలా నెర‌వేరుస్తారు….రేవంత్‌కు బండి ప్ర‌శ్న ..

వేములవాడ – అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణను ఎలా గట్టెక్కిస్తారని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. వేముల‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఒక‌వైపు అప్పుల‌లో రాష్ట్రం అంటూ మ‌రో వైపు ఆరు గ్యారంటీల‌ను ఎలా అమ‌లు చేస్తార‌ని నిల‌దీశారు.

హామీల అమ‌లుపై ప్ర‌జ‌ల‌లో అనేక అనుమానాలున్నాయ‌ని , వాటిని రేవంత్ నివృత్తి చేయాల‌ని డిమాండ్ చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని 42 పేజీల శ్వేత పత్రాన్ని రాష్ట్ర ప్రజల ముందు పెట్టిన విష‌యాన్ని గుర్తు చేస్తూ అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో అమలుకు సాధ్యం కానీ హామీలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవాలన్న అంశంపై కోర్‌కమిటీ సమావేశంలో చర్చించామ‌న్నారు. రాష్ట్రం నుంచి ఎక్కువమంది బీజేపీ ఎంపీలు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయని, కాబట్టి ఆలోచించి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈటల రాజేందర్‌తో తనకు విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలపై స్పందిస్తూ అలాంటిదేమీ లేదని, అందరితో కలిసే ఉంటానని బండి తెలిపారు. లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో జాతీయ పార్టీల మ‌ధ్య పోరు ఉంటుంద‌ని, ప్రాంతీయ పార్టీల‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోర‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement