Thursday, October 10, 2024

టెట్ ప్రాథమిక కీ పై ఆన్‌లైన్‌లో అభ్యంతరాల స్వీకరణ ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. TS TET పేపర్‌-1, 2 ‘కీ’లను విడుదల చేసిన అధికారులు.. ఆన్‌లైన్‌లో అభ్యంతరాల స్వీకరిస్తున్నారు.అనంతరం తుది కీతో పాటు ఫలితాలు వెల్లడిస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు 15న జరిగిన టెట్‌ పేపర్‌-1కు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 2,26,744 మంది(84.12 శాతం) పరీక్ష రాశారు. బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్‌-2కు 2,08,498మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 91.11 శాతం మంది హాజరైన విషయం తెలిసిందే. టెట్‌ ఫలితాలు సెప్టెంబర్ 27న విడుదల కానున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement