Tuesday, May 7, 2024

భారత్‌లో తొలిసారిగా MotoGP.. రేపు ఘనంగా ప్రారంభం కానున్న బైక్ రేసింగ్

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌ రేస్‌ MotoGP. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఏటా నిర్వహించే మోటోజీపీ గ్రాండ్ ప్రిక్స్‌ రేసులను ఈ ఏడాది భారత్‌లోనూ నిర్వహిస్తున్నారు. భారతదేశంలో MotoGP Racing నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. భారత్‌లో మొట్టమొదటిసారిగా నిర్వహించనున్న MotoGP రేస్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. MotoGP మోటార్‌సైకిల్‌ రేస్‌ ఔత్సాహికుల్లో మాత్రమే కాకుండా సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది.

మోటోజీపీ భారత్‌ రేస్‌ ఉత్తరప్రదేశ్‌ గ్రేటర్ నోయిడా సమీపంలోని బుద్ధ్‌ ఇంటర్నేషనల్ రేస్‌కోర్స్‌లో 3 రోజుల పాటు సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు జరగనుంది. ఈ పోటీల్లో మొత్తం 11 జట్ల నుంచి 22 మంది రైడర్లు పాల్గొంటున్నారు. ప్రపంచంలోని ప్రముఖ బైక్ రేసర్లు అయిన ఫాబియో క్వార్టరారో, అలెక్స్ ఎస్పార్‌గారో మరియు ఫ్రాన్సిస్కో పగానియా MotoGP భారత్ 2023 రేసుల్లో పాల్గొననున్నారు.

ఈ నేపథ్యంలో ఈవెంట్‌ జరిగే ఈ 3 రోజుల్లో 1 లక్ష మందికి పైగా ఔత్సాహికులు గ్రేటర్ నోయిడాను సందర్శిస్తారని అంచనా. గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేకి సమీపంలో ఉన్న బుద్ధ్‌ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఒకేసారి 1,10,000 మంది కూర్చుని రేసింగ్‌ చూసే అవకాశం ఉంది.

- Advertisement -

అయితే మొదటి రోజు సెప్టెంబర్ 22న సర్క్యూట్‌లో ప్రాక్టీస్ రేసులు జరుగుతాయి. ఈ ప్రాక్టీస్ రేసుల ద్వారా, రైడర్లు బౌద్ధ రేసింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుందో ఓ అంచనాకి రావొచ్చు. ఆ తర్వాత సెప్టెంబర్ 23న క్వాలిఫయింగ్ రేసులు నిర్వహిస్తారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రేసర్లు వారి టీమ్స్‌ సెప్టెంబర్ 24న జరిగే ఫైనల్ రౌండ్ రేసులకు అర్హత సాధిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement