Friday, May 3, 2024

దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ: కలెక్టర్ తిరుపతిరావు..

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు పేర్కొన్నారు. రైతును రాజుగా చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ద్వారా రైతులు పండించిన వారి ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలుపై పౌర సరఫరాల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భాంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో వాన కాలంలో వరి ధాన్యం 1.70లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా, అందుకు తగినట్లుగా అవసరమైన గన్ని బ్యాగులను సిద్ధంగా ఉంచాలని ఆయన సూచించారు. జిల్లాలో 38 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వరి ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు గ్రేడ్ – A రకానికి రూ. 1960/-, సాధారణ రకానికి రూ. 1940/- లభిస్తుందని తెలిపారు.

ఇట్టి ధర లభించాలంటే రైతులు పలు జాగ్రత్తలు వహించాలన్నారు. ధాన్యం అమ్మకానికి తెచ్చే ముందు తాలు గింజలు, కల్తీ గింజలు, పొల్లు లేకుండా తెచ్చినట్లయితే ఆశించిన ధర లభిస్తుందన్నారు. తేమ శాంతం ఖచ్చితంగా 17 శాంతం లోపు ఉండేటట్లుగా చేసి మీ టోకెన్ ప్రకారం కేటాయించిన రోజు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొని రవాలన్నారు. ధాన్యం తూకం వేసిన తరువాత రైతులు విధిగా కొనుగోలు రసీదు పొందాలన్నారు.

కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించే సమయంలో మీ ఫోనుకు ఓటీపీ నెంబర్ కొసం తప్పక తమ ఫోన్ వెంట తీసుకరావాలని సూచించారు. రైతులు తమ ఫోన్ నంబర్లను ఆధార్ నెంబర్ తో తప్పకుండా అనుసంధానం చేసుకోవాలన్నారు. ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకము, బ్యాంకు ఖాతా నెంబర్, జిల్లా కలెక్టర్ చె నియమించబడిన అధికారి ధ్రువీకరణ పత్రం తప్పక జాతచేయాలనీ సూచించారు. బ్యాంకు ఖాతా పని చేస్తున్నట్లుగా బ్యాంకు అధికారుల నుండి ధ్రువీకరించుకొవాలని ఆయన సూచించారు.

అనంతరం కరపత్రాలను, పోస్టర్స్ రిలీజ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారులు మనోహర్ రాథోడ్, శ్యామా లక్ష్మి, జిల్లా కో ఆపరేటివ్ అధికారి ధాత్రి దేవి, టేకిన్నికల్ అసిస్టెంట్ మేనేజర్ ఇర్ఫాన్, కొనుగోలు కేంద్రాల అసోసియేషన్స్ ఛైర్మన్స్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement