Friday, May 3, 2024

దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ.. సునీతా మహేందర్ రెడ్డి

ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి : దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అవిర్భవించిందని ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండలంలోని పుట్టగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… సమైఖ్య పాలనలో ఎడారిగా మారిన తెలంగాణ నేడు మరో కోనసీమగా మారిందన్నారు. మిషన్ కాకతీయ, చెక్ డ్యామ్ లు, ప్రాజెక్టుల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి రాష్ట్రం వ్యవసాయానికి అనుకూలంగా మార్చిన ఘనత కేసీఆర్ కి దక్కిందన్నారు. వ్యవసాయమే దండగ అన్న నేతల మాటలను తిరగరాస్తూ నేడు వ్యవసాయంను పండగలా చేశాడన్నారు.

దేశంలోనే పంజాబ్ రాష్ట్రం తర్వాత ఆహార ధాన్యాలు ఉత్పత్తిలో తెలంగాణ రెండవ రాష్ట్రంగా అవిర్భవించిందన్నారు. రైతుల అభివృద్దే ధ్యేయంగా రైతు బంధు, ఉచిత విద్యుత్, రైతు బీమా, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ రైతు భాంధావుడిగా కేసీఆర్ నిలిచాడన్నారు. రైతులు దళారులకు ధాన్యాన్ని అమ్మకుండా మద్దతు ధరతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నారు. అనంతరం నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ చింతలపురి భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ కాకళ్ల ఉపేందర్, మదర్ డెయిరీ డైరెక్టర్లు గొల్లపల్లి రాంరెడ్డి, ఆర్కాల గాల్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, నాయకులు నాగిర్తి రాజిరెడ్డి, ఎడ్ల బాలలక్ష్మి, సందిల భాస్కర్ గౌడ్, గొల్లపల్లి భాగ్యలక్ష్మిరాంరెడ్డి, జనపల్లి ప్రభాకర్ రెడ్డి, మాడోత్ దేవి రాములు నాయక్, లక్ష్మణ్ నాయక్, పీఏసీఎస్ కార్యదర్శి సిల్వెరు చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement